డైలీ భారత్, కామారెడ్డి: మానవత్వం కోసం ఒక చేయూత. కామారెడ్డి పట్టణం బృందావన్ కాలనీలో నివసిస్తున్న పండరి - స్వరూప కుటుంబం తీవ్ర అనారోగ్యం మరియు పేదరికంతో అల్లాడుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన శ్రీమాతా సేవా చారిటబుల్ ట్రస్ట్ దాతల సహాయంతో వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
ఇప్పటికే కొందరు దాతలు స్పందించారు. మచ్చ నాగరాజు స్వరూప గారికి ఒక పరుపును అందించారు. గంజి వెంకటేశం కిరాణా సామాను మరియు 3 బెడ్ షీట్లు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా నిలిచారు. వారికి ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కానీ ఈ కుటుంబ పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. ప్రస్తుతం వారికి తినడానికి సరిపడా ఆహారం లేదు. ధరించడానికి కనీస వస్త్రాలు కూడా లేవు.
ఈ కుటుంబానికి అత్యవసరంగా కావాల్సినవి
ఆహారం: బియ్యం, పప్పులు, నిత్యావసర కిరాణా
బట్టలు: ఉపయోగించగలిగే పాత లేదా కొత్త వస్త్రాలు
గృహ సామాను: బెడ్ షీట్లు, దుప్పట్లు, పరుపులు
ఆర్థిక సహాయం
"ఒక కుటుంబం ఆకలితో బాధపడకుండా, ఒక తల్లి కన్నీళ్లు ఆరేలా మనమందరం కలిసి చేయి అందిద్దాం" అని శ్రీమాత సేవా కుటుంబం పేర్కొంది. _మానవ సేవే మాధవ సేవ_ అనే నినాదంతో స్పందించే దాతలు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
సహాయం అందించాలనుకునేవారు శ్రీమాతా సేవా చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగలరు.