డైలీ భారత్, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీ పరిధిలోని దబ్బతోగు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి! అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి!
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు!
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, మాటలు చెపుతూనే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు! ఏ గ్రామంలో చూసిన ప్రజలు గులాబీ జెండానే కోరుకుంటున్నారని, గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ, ప్రజల నుంచి వస్తున్న మద్దతు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు! రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు!
ఈ కార్యక్రమంలో జూపల్లి రమణారావు, మాజీ MPP జల్లిపల్లి శ్రీరామమూర్తి, మాజీ మండల అధ్యక్షులు జుజ్జూరి వెంకన్న బాబు, మోహన్ రెడ్డి, సంక ప్రసాద్, కలపాల బాబురావు, మాజీ MPTC కన్నమ్మ, మాజీ సర్పంచ్లు నారం రాజ్ శేఖర్, సాధు జ్యోత్స్న బాయి, చెన్నారావు, కొనకళ్ళ రామలింగయ్య, జజ్జూరి ప్రసాద్, తుంపాటి రమేష్, ఆసిఫ్, రెహ్మాన్, బన్ను, సంతోష్, అమీర్, నాగు, వంశీ తదితరులు ఉన్నారు!
#DailyBharath #Ashwaraopet #Dabbatogu #BRS #MechaNageswaraRao #KCR #Telangana #BreakingNews