| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు! రాజ్యాంగ విలువలను కాపాడాలని విద్యార్థులకు పిలుపు!

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు! రాజ్యాంగ విలువలను కాపాడాలని విద్యార్థులకు పిలుపు!

డైలీ భారత్, కథలాపూర్: కథలాపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తండ్రియాల నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు!

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను, రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పాత్రను వివరించారు! రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువల గురించి అవగాహన కల్పించారు!

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారత రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివి రాజ్యాంగ విలువలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు! విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగాలు చేశారు!

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలు మరియు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే స్ఫూర్తిని పెంపొందించారు!

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పారిపెల్లి రవి కుమార్, ఉపాధ్యాయులు సత్య, నరేష్, శ్రీధర్ రావ్, రాజు, సంధ్య, అనూష, మయూరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు!

#DailyBharath #ConstitutionDay #Kathalapur #Jagtial #Ambedkar #Telangana

Previous సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి వర్ధమాన్ జైన్ అందించిన రూ.207.6 కోట్ల బంగారు ఆభరణాలు!
Next బాల్య వివాహం బతుకు ఆగం... సిరిసిల్లను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి...
ADVERTISEMENT