డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్లలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థి దూస ప్రతీక్ నందన్ ఘనత సాధించాడు! రాష్ట్రస్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలకు ఎంపికయ్యాడు!
ఈ పోటీలు జీయర్ గురుకులం, అల్లంపల్లి వేదికగా జరగనున్నాయి!
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా విద్యార్థి ప్రతీక్ నందన్‌ను పాఠశాల కరస్పాండెంట్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు! ఈ సందర్భంగా విద్యార్థి మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు!
ప్రతీక్ నందన్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు పోటీలలో విజయం సాధించాలని శుభాకాంక్షలు!
#DailyBharath #Sircilla #Archery #EnglishUnionHighSchool #PratheekNandan #Telangana