డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలం, చింతగుప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ అక్కాచెల్లెళ్లు పొడియం సుగుణ (అండర్-17), పొడియం అనూష (అండర్-14) ప్రతిష్ఠాత్మకమైన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ )జాతీయ స్థాయి హాకీ* పోటీలకు ఎంపికయ్యారు.అత్యంత పేద వ్యవసాయ ఆధారిత ఆదివాసీ కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు బాలికలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గ్వాలియర్ (మధ్యప్రదేశ్), సుందర్‌గఢ్ (ఒడిశా)లకు ప్రయాణించాల్సి ఉంది.అవసరమైన స్పోర్ట్స్ షూస్, క్రీడా దుస్తులు, ప్రయాణ ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ చిన్న అరుణాచలం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ శివ నాగస్వామి స్పందించి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా బీజేపీ ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా బాలికలను ప్రోత్సహిస్తూ రూ.1,000 ఆర్థిక సహాయం అందజేశారు.
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా* ఉంటామని పలుమార్లు తన సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించుకున్న శివ నాగస్వామి గారు, మరోసారి ఆదివాసీ బాలికల క్రీడా ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని యువ నాయకులు కుంజా సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి హాకీ పోటీల్లో తమ ప్రతిభను చాటి, భద్రాచలం ప్రాంతానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పొడియం రామమ్మ, పొడియం ముత్తయ్యలతో పాటు పిఇడి పూనెం రవీందర్, నంద్యాల బాలకృష్ణ, సాయి కౌశిక్, సవలం వంశీ, కట్టం రాముడు, కోడి బాలయ్య, ఇరకం ఎర్రయ్య, తుర్రం ముద్దిరాజుతదితరులు పాల్గొన్నారు.