డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన వరుడు ముక్తి నాగరాజ్ మరియు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కాలనీ నాచారం గ్రామానికి చెందిన వధువు వరుస జాహ్నవి గత మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు! యువ జంటకు అండగా నిలిచి, వారి ప్రేమ వివాహాన్ని ఘనంగా జరిపించారు హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర నేషనల్ సెక్రటరీ మహిళా వింగ్ కోడెం సీతా కుమారి మరియు గ్రామ పెద్దలు!
అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు ఇరువురు కుటుంబ సభ్యులు పెద్దల అంగీకారం కోసం ప్రయత్నించి, ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నించినా వివాహాన్ని అంగీకరించలేదు! ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలను ప్రేమ జంట ఆశ్రయించారు! చట్టబద్ధంగా, గౌరవప్రదంగా వివాహం జరిపించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు!
ఈ సందర్భంగా కోడెం సీతా కుమారి మాట్లాడుతూ ప్రేమ నేరం కాదు, ప్రేమించడం హక్కు అని, ప్రేమ జంటలకు భద్రత కల్పించడం మా బాధ్యత అని స్పష్టం చేశారు!
ప్రేమను గెలిపించడం కాదు, ప్రేమించిన ఇద్దరు మనుషులను బతికించడం మా ధర్మం!
కులం కన్నా గొప్పది మనిషి, మతం కన్నా గొప్పది మానవత్వం!
ప్రేమ కన్నా గొప్పది ఇంకేదీ లేదు!
ప్రేమించిన వారిని విడదీయడం కాదు, కలపడమే నిజమైన మానవ హక్కు!
ఇద్దరు మనసులు కలిస్తే అది పెళ్లి, వాటికి అండగా నిలబడితే అది మానవత్వం!
భయంతో కాదు, భరోసాతో బ్రతకాలి ప్రేమ జంటలు!
వారికి రక్షణ ఇవ్వడమే హ్యూమన్ రైట్స్ లక్ష్యం అని ఆమె అన్నారు!
ఈ కార్యక్రమంలో కోడెం సీతా కుమారి, హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర నేషనల్ సెక్రటరీ మహిళా వింగ్ మరియు గ్రామ పెద్దలు గుర్రం మల్లయ్య, మల్కం అప్పయ్య, ముక్తి శ్రీనివాసరావు, మల్కం రాములు, మహిళా సంఘం సభ్యులు సత్యవతి, ఇర్ఫా సీత, గలిగే సూరమ్మ, ముక్తి కృష్ణకుమారి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు! ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు!
#DailyBharath #Kothagudem #Khammam #LoveMarriage #HumanRights #Telangana