| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజ్మీర సురేష్ నాయక్!

వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజ్మీర సురేష్ నాయక్!

డైలీ భారత్, వైరా: NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అజ్మీర సురేష్ నాయక్ వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్ నాయక్ ను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు! ఈ సందర్భంగా తనకు అప్పగించిన NSUI జిల్లా అధ్యక్ష బాధ్యతల విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు!

అనంతరం అజ్మీర సురేష్ నాయక్ ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ ను శాలువాతో సత్కరించారు! అనంతరం ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ కూడా అజ్మీర సురేష్ నాయక్ ను శాలువాతో సత్కరించి, NSUI జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, వారికి అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు! తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని సూచించారు!

అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు! జిల్లాలోని విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు! విద్య, ఫీజులు, ఉపాధి తదితర అంశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు!

జిల్లాలో NSUI ని మరింత బలోపేతం చేస్తూ విద్యార్థులు, యువతకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అజ్మీర సురేష్ నాయక్ పేర్కొన్నారు!

#DailyBharath #Wyra #NSUI #AjmeeraSureshNaik #MalothRamdasNaik #BhadradriKothagudem #Congress #Telangana #BreakingNews

Previous దబ్బతోగులో 30 కుటుంబాలు BRS పార్టీలో చేరిక! కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ MLA మెచ్చా!
Next రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జిల్లా కార్మిక అధికారికి నివేదిక!
ADVERTISEMENT