| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు!

శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు!

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామంలో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు!

ఈ సందర్భంగా వేద పండితుల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు!

అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు!

ఈ సందర్భంగా దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇసన్నపల్లిలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని పేర్కొన్నారు! స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడం సంతోషకరమన్నారు! ఆలయానికి ఉన్న విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు!

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతల శంకర్, ఏవో ప్రభు, రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోతి లచ్చయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #Kamareddy #Ramareddy #Isannapalli #KalaBhairava #Endowments #Telangana #BreakingNews

Previous కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్ సందడి... ఇందుప్రియకు ఘన సన్మానం... కల్పన మర్యాదపూర్వక భేటీ!
Next దబ్బతోగులో 30 కుటుంబాలు BRS పార్టీలో చేరిక! కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ MLA మెచ్చా!
ADVERTISEMENT