డైలీ భారత్, కామారెడ్డి: లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు, నగదు అపహరిస్తున్న 5 గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు! ఆపరేషన్ కవాచ్ ద్వారా ముఠా సభ్యులు వారి వాహనం పట్టివేత జరిగింది! ఒక క్రెటా కారు, 25 రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు! కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర వెల్లడించారు!
తేదీ 21, 22 నవంబర్ 2026 నాడు అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1 గంట సమయంలో కామారెడ్డి పట్టణంలోని అక్షయ గ్రాండ్ లాడ్జికి 5 గురు వ్యక్తులు వచ్చి రూమ్ కావాలని మాట్లాడిస్తూ డ్యూటీలో ఉన్న మేనేజర్ ను బెదిరించి లాడ్జికి సంబంధించిన రిజిస్టర్లు, 10 వేల రూపాయల నగదు దొంగిలించారని ఫిర్యాదు రాగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది!
జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్ మధుసూదన్ పర్యవేక్షణలో, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి! సీసీటీవీ ఫుటేజ్ మరియు పోలీసులు ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా నేరస్తులను పట్టుకునేందుకు తగు చర్యలు చేపట్టారు! ఈ క్రమంలో నిన్న తేదీ 24 నవంబర్ 2026 రాత్రి కామారెడ్డి పట్టణ కేంద్రం ఎంట్రెన్స్ లోని ఆపరేషన్ కవాచ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపి అందులోని వ్యక్తుల వివరాలు అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో వారిని, వారి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి విచారించగా అక్షయ గ్రాండ్ లాడ్జి కామారెడ్డి యందు చేసిన నేరం తరహాలోనే మరలా నేరం చేసేందుకు రాగా పోలీసులు పట్టుకోవడం జరిగింది!
వివరాల్లోకి వెళితే: నిందితులు మాచిహళ్లి మారుతి మరియు అతని సహచరులు చాక్రీ పరశురాం, అభిషేక్ కవ్వాడి, వెంకటేష్ సత్వాడి, సాటపాడి సంతోష్ అను కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 గురు సభ్యులు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు! సులభంగా మరియు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే దానికోసం వివిధ ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లకు వెళ్లి రూములు కావాలని అడిగి, అక్కడి మేనేజర్లను బెదిరించి, లాడ్జీలలో బస చేసే వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు తదితర వివరాలు కలిగిన రిజిస్టర్లను బలవంతంగా దొంగిలించి ఆ రిజిస్టర్లలోని ఫోన్ నంబర్లకు కాల్ చేసి, సదరు వ్యక్తులు గతంలో ఆయా లాడ్జీలలో బస చేసిన తేదీలు, సమయాలు, ఆధార్ కార్డు వివరాలు తదితర సమాచారాన్ని తెలియజేస్తూ, వారికి పరిచయస్తులుగా నమ్మకం కలిగించి, కర్ణాటక రాష్ట్రంలో తక్కువ ధరకు బంగారం లభిస్తుందని చెప్పి మొదట అసలు బంగారాన్ని శాంపిల్ గా చూపించి, అనంతరం కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయాలని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేయడం నేర ప్రవృత్తిగా ఎంచుకున్నారు!
ఈ పథకంలో భాగంగా నిందితులు కర్ణాటక రాష్ట్రం నాగరాజు అనే వ్యక్తి వద్ద నుండి టూర్ కి వెళ్తున్నామని చెప్పి అద్దెకు తీసుకున్న క్రెటా కారులో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి జోగుళాంబ గద్వాల జిల్లాలోని హోటల్ గీత లాడ్జి, జడ్చర్లలోని అతిథి డీలక్స్ లాడ్జి, హోటల్ సితార లాడ్జి, షాద్ నగర్ లోని శ్రీ బాలాజీ లాడ్జి, కొత్తూరులోని ఓవైఓ రెసిడెన్సీ లాడ్జి, హైదరాబాద్ చందానగర్ లోని ఎస్ఎస్ఆర్ లగ్జరీ లాడ్జి, శ్రీ సుప్రజా లాడ్జి, సంగారెడ్డిలోని శ్రీ సాయికృష్ణ లాడ్జి, మెదక్ జిల్లా నర్సాపూర్ లోని శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ హోటల్ తదితర ప్రాంతాల్లోని లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లను బలవంతంగా దొంగిలించారు!
ఇదే క్రమంలో తేదీ 21 నవంబర్ 2026 అర్ధరాత్రి దాటిన తరువాత కామారెడ్డి పట్టణంలోని అక్షయ గ్రాండ్ లాడ్జికి వెళ్లి మేనేజర్ ను బెదిరించి 10 వేల రూపాయల నగదు మరియు లాడ్జికి సంబంధించిన రిజిస్టర్లను దొంగిలించారు! మేనేజర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్ చూపించి మరియు కారు కింద పడేసి చంపుతామని బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు! దొంగిలించిన 10 వేల రూపాయల నగదును అందరూ సమానంగా పంచుకున్నారని దర్యాప్తులో తేలింది!
నిందితుల వివరాలు:
ఏ1 మాచిహళ్లి మారుతి, తండ్రి ప్రభు, 32 సంవత్సరాలు, మాచిహళ్లి కొరచరహట్టి గ్రామం!
ఏ2 చక్రి పరశురామ్ మాదిగ, తండ్రి బసవరాజ్, 25 సంవత్సరాలు, ఆదివిహళ్లి గ్రామం!
ఏ3 అభిషేక్ కవ్వాడి, తండ్రి వెంకటేష్, 21 సంవత్సరాలు, బతనహళ్లి గ్రామం!
ఏ4 వెంకటేష్ సట్పాడి, తండ్రి దేవేంద్రప్ప, 25 సంవత్సరాలు, హుచ్చవనహళ్లి గ్రామం!
ఏ5 సంతోష్ సట్పాడి లక్ష్మప్ప, తండ్రి లక్ష్మప్ప, 32 సంవత్సరాలు, బతనహళ్లి గ్రామం!
ఏ1 నుంచి ఏ5 వరకు విజయనగర జిల్లా హోస్పేట్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు!
స్వాధీనపు వివరాలు:
నగదు 8 వేల 500 రూపాయలు, నేరానికి ఉపయోగించిన క్రెటా కారు, రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ 05 ఎన్డీ 8238, ఒక స్క్రూడ్రైవర్, 25 రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు 10 తులాలు, 2 తులాలు, 1 తులం మరియు అర తులం బరువుగల ఒక్కొక్క బిస్కెట్, నిందితులు నేరానికి ఉపయోగించిన 5 మొబైల్ ఫోన్లు!
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో ఉన్న వ్యక్తుల వివరాలను ఉపయోగించి మరిన్ని మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, నిందితుల నేర పద్ధతులు, ఇతర నేరాల్లో వారి ప్రమేయం, మిగిలిన నిందితుల ఆచూకీ తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు!
ఆపరేషన్ కవాచ్ లో చాకచక్యంగా వ్యవహరించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 గురు ముఠా సభ్యులను పట్టుకున్న దర్యాప్తు అధికారి మరియు సిబ్బంది సాయిలు ఏఆర్ఎస్ఐ, భాను, రాహుల్, శుండాల సింగ్, పీర్య కానిస్టేబుల్ మరియు మల్లేష్ హోమ్ గార్డ్ లను ఎస్పీ అభినందించి, నగదు రివార్డులను అందజేయడం జరిగింది!
కామారెడ్డి జిల్లా పోలీసుల విజ్ఞప్తి:
ప్రజలు తక్కువ ధరకు బంగారం ఇస్తామని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు విలువైన వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి, మోసపోయి డబ్బులు చెల్లించవద్దు! అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ వివరాలు లేదా గత ప్రయాణ వివరాలు తెలియజేసి నమ్మకం కలిగించినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి! ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసపూరిత కార్యకలాపాలు మీకు గాని, మీకు తెలిసిన వారికి జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి!
#DailyBharath #Kamareddy #KamareddyPolice #CrimeNews #TelanganaPolice #BreakingNews