డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా సంబంధాల శాఖకు సంబంధించిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది! జిల్లా ప్రజా సంబంధాల అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం!
తనకు ఎదురైన ఇబ్బందులకు సంబంధించిన ఆడియో రికార్డులు, ఇతర ఆధారాలను జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది! ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరినట్లు సమాచారం!
విచారణ చేపట్టాలని డిమాండ్:
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత! మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేసే పరిస్థితులు ఉండాలి! ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు!
ఆధారాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలి:
మహిళ సమర్పించినట్లు చెబుతున్న ఆడియో రికార్డులు, ఇతర ఆధారాలను సాంకేతికంగా పరిశీలించి, ఫిర్యాదులోని అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది! ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కూడా తన వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!
మహిళకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం స్పందించాలని, విచారణలో పారదర్శకత పాటించాలని కోరుతున్నారు!
#DailyBharath #BhadradriKothagudem #DPRO #Collector #BreakingNews #Telangana