డైలీ భారత్, గద్వాల: గద్వాలలో ఏసీబీ అధికారులు భారీ ట్రాప్ వేశారు! టీజీఎస్పీడీసీఎల్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అన్నారపు రమేష్ బాబును రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు!
కాంట్రాక్టర్ కు రావాల్సిన రూ.12.62 లక్షల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు రమేష్ బాబు రూ.60 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ! కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నవంబర్ 26న ట్రాప్ వేశారు!
ఫిర్యాదుదారుడిని తన కారు డ్యాష్ బోర్డు పై డబ్బులు పెట్టమని రమేష్ బాబు చెప్పినట్లు సమాచారం! ప్రయాణంలో ఉండగా ఏసీబీ అధికారులు వాహనాన్ని అడ్డగించి డబ్బును స్వాధీనం చేసుకున్నారు! కెమికల్ టెస్ట్ లో లంచం డబ్బుకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది!
నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు! హైదరాబాద్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది! విచారణ కొనసాగుతోంది!
ప్రజలు గమనించండి: ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా వాట్సాప్ 9440446106 కు ఫిర్యాదు చేయవచ్చు!
#DailyBharath #Gadwal #ACB #Bribe #TGSPDCL #Telangana #acb telangana