| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కార్తిక దీపం వివాదం... సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పిన తమిళనాడు ప్రభుత్వం ! ఆలయ బోర్డుపై నెపం!

కార్తిక దీపం వివాదం... సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పిన తమిళనాడు ప్రభుత్వం ! ఆలయ బోర్డుపై నెపం!

డైలీ భారత్, న్యూఢిల్లీ, చెన్నై: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే వివాదం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది! కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం దీపత్తూన్ వద్ద కార్తిక దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు తెలిపింది!

అసలేం జరిగింది?

మదురై తిరుప్పరంకుండ్రం కొండపై సికిందర్ బాదుషా దర్గా సమీపంలో ఉన్న దీపత్తూన్ వద్ద నవంబర్ 24న సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ఒకసారి మాత్రమే కార్తిక దీపం వెలిగించేందుకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 20న మధ్యంతర అనుమతి ఇచ్చింది! దేవస్థానం అనుమతించిన ప్రత్యేక బృందం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించాలని, దీనికి మదురై జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ పోలీసు, పురావస్తు శాఖ అధికారులతో సమన్వయం చేయాలని కోర్టు స్పష్టం చేసింది!

అయితే, నవంబర్ 24న దీపత్తూన్ వద్ద దీపం వెలిగించలేదు! ఆలయ అధికారులు ఎప్పటిలాగే ఉచ్చిపిళ్ళయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ ప్రదేశంలోనే కార్తిక దీపాన్ని వెలిగించారు! కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు!

కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్, ఆలయ బోర్డుపై నెపం:

ఈ వ్యవహారంపై నవంబర్ 25న మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ సుప్రీంకోర్టులో ప్రాథమిక స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు! ఇందులో ఆయన కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూనే, నెపాన్ని ఆలయ ధర్మకర్తల మండలిపైకి నెట్టారు!

కోర్టు ఆదేశాల ప్రకారం దీపం వెలిగించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ తెలిపారు! నవంబర్ 24న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు, తిరిగి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు ఆలయ కార్యనిర్వహణాధికారికి ఈమెయిల్స్ పంపి, 10 మంది సభ్యుల బృందాన్ని పంపాలని ఆదేశించినట్లు వివరించారు! అయితే, ఆలయ సంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తాం అంటూ ఆలయ ధర్మకర్తల మండలి ఆ బృందానికి అనుమతి నిరాకరించిందని, దేవస్థానం అనుమతి లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు నేరుగా జోక్యం చేసుకునే అధికారం లేదని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు!

సుప్రీంకోర్టు తదుపరి చర్యలు:

కలెక్టర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు విన్న ధర్మాసనం, ఈ విషయంలో సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టేందుకు నిరాకరించింది! అయితే, పిటిషనర్లు దాఖలు చేసిన ధిక్కరణ దరఖాస్తును పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను 2027 జనవరికి వాయిదా వేసింది! మరోవైపు, నవంబర్ 20 నాటి తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ విజయ్ ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది!

ముదురుతున్న రాజకీయ దుమారం:

ఈ ఘటనపై తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది! సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, బుజ్జగింపు రాజకీయాల కోసం విజయ్ ప్రభుత్వం హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది! ఆలయ బోర్డు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నప్పుడు, బోర్డుపై నెపం నెట్టి తప్పించుకోవడం సరికాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి!

#DailyBharath #KarthigaiDeepam #SupremeCourt #Vijay #TVK #TamilNadu #Madurai #Thiruparankundram #BreakingNews

Previous నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో! హైదరాబాద్ లో భారీ నషా ముక్త్ భారత్ మహా పాదయాత్ర!
Next లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు, నగదు అపహరిస్తున్న 5 గురు అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్!
ADVERTISEMENT