| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో! హైదరాబాద్ లో భారీ నషా ముక్త్ భారత్ మహా పాదయాత్ర!

నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో! హైదరాబాద్ లో భారీ నషా ముక్త్ భారత్ మహా పాదయాత్ర!

నషా ముక్త్ భారత్ మహా పాదయాత్రలో యువతకు బీజేపీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి పిలుపు!

డైలీ భారత్, హైదరాబాద్: డ్రగ్స్ ఫ్రీ సొసైటీ నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ మహా పాదయాత్ర జరిగింది!

బుధవారం అంబర్పేట్ మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్ద జెండా ఊపి లాంచనంగా ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, సినీహీరో విక్టరీ వెంకటేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ!

ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూతురు కీర్తిరెడ్డి, పార్టీ ఇతర సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, యువతి యువకులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు!

ప్రతిజ్ఞ:

కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన అతిథులు, విద్యార్థులు!

ప్రత్యేక ఆకర్షణగా:

హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్రలో కళాకారుల ఆటపాటలు, పాఠశాల విద్యార్థుల నృత్యాలు, సే నో టు డ్రగ్స్ స్లోగన్స్, డీజే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి!

ఆసక్తికరంగా డ్రగ్స్ స్కిట్:

మత్తు పదార్థాలకు యువత ఎలా బానిసలు అవుతున్నారన్న కాన్సెప్ట్ తో వేసిన స్కిట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది!

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ దేశానికి యువతే బలం బలగం అని అన్నారు! అలాంటి యువతను టార్గెట్ చేస్తూ కొందరు దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు! దేశంలో స్కూల్ స్థాయి వరకు డ్రగ్స్ కల్చర్ వేళ్లూనుకుపోయిందని అన్నారు! రేపు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే మనమంతా ఈ డ్రగ్స్ ఫ్రీ సమాజాన్ని నిర్మించుకోవాలని అన్నారు!

ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు! రేపటి మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, ముఖ్యంగా భావితరాలు బాగుపడాలంటే మత్తు పదార్థాలు లేని భారతదేశం కావాలని అన్నారు! ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరగబోయే ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని అన్నారు! ప్రజలు, యువకులు ఈ నషా ముక్త్ భారత్ సాధనలో కలిసి రావాలని కోరారు!

డ్రగ్ ఫ్రీ సొసైటీ సాధన ఒక్క పోలీసులు, రాజకీయ నాయకుల వల్లనో సాధ్యం కాదని, ప్రజలు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చినప్పుడే మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు!

#DailyBharath #Hyderabad #NashaMuktBharat #KishanReddy #JuturKeerthiReddy #BJP #SayNoToDrugs #BreakingNews

Previous రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జిల్లా కార్మిక అధికారికి నివేదిక!
Next కార్తిక దీపం వివాదం... సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పిన తమిళనాడు ప్రభుత్వం ! ఆలయ బోర్డుపై నెపం!
ADVERTISEMENT