| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాదితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. విద్యుత్ నగర్ కు చెందిన సురేష్ లైన్ ఇన్ స్పెక్టర్ గా అతని భార్య లావణ్య ప్రభుత్వ టీచర్ గా పని చేసుకుంటూ విద్యుత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కాగా వారి ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిపారు. బీరువాలో ఇంట్లో దాచిన 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90 వేల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారని బాదితులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాదితులు బోరున విలపించారు. దుండగులను పట్టుకొని తమ సొత్తు తిరిగి దక్కేలా చూడాలని కోరారు. బాధితులు ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంఘటన స్థలాన్ని పోలీసులు సిసిఎస్ టీం వచ్చి పరిశీలించారు వేలిముద్రలు సేకరించారు


Previous పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..
Next ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
ADVERTISEMENT