| Daily భారత్
Logo




ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు

News

Posted on 2026-01-31 13:59:01

Share: Share


ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లతో సతమతమవుతోంది. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులు ఉన్నారు.న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉండాల్సిన సంఖ్య కన్నా ఇది తక్కువ. సకాలంలో న్యాయం జరగాలంటే జనాభాకు తగినంత మంది జడ్జీలు లేరని తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2026 నాటికి ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు కేంద్రం తెలిపింది.అధికారిక వివరాల ప్రకారం, సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారు. హైకోర్టులో 1122 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ ప్రస్తుతం 814 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక కేసులు జిల్లా, దిగుమ కోర్టుల్లోనే ఉన్నాయి. ఈ కోర్టుల్లో 20,833 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అయినా కూడా పెండింగ్ కేసులు తగ్గించడానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.


ప్రధాన కోర్టుల్లో గణనీయంగా న్యాయమూర్తుల కొరత ఉంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 120వ నివేదికలో ప్రతీ 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని సూచించింది. ఈ సంఖ్యలో సగం కూడా ప్రస్తుతం లేరు. కొర్టులపై ఉన్న ఒత్తిడి జైళ్లలో కనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ బ్యూర్(NCRB) ప్రకారం, 2023 నాటికి 3,89,910 మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో ఉన్నారు. సత్వర న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. కోర్టుల మౌలిక సదుపాయాలను మెరుగుపరడచంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాకారంతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి ఈ-కోర్టులు మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ద్వారా టెక్నాలజీని తీసుకువస్తోంది.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >