| Daily భారత్
Logo




మెడికవర్ హాస్పిటల్ ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం

News

Posted on 2026-01-26 17:44:50

Share: Share


మెడికవర్ హాస్పిటల్ ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం

డైలీ భారత్, హుజూర్ నగర్: ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు చేయించు కోవడం ద్వారా దీర్ఘకాలిక నొప్పులు శస్త్రచికిత్స అవసరాన్ని  తగ్గించవచ్చని సీఐ చరమందరాజు తెలిపారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ నందు ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గాంధీ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ సంయుక్తంగా ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పలువురు పట్టణ ప్రజలకు మెడికవర్ హాస్పిటల్ వారి ఫ్యామిలీ కార్డులను ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ చరమందరాజు చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు.కార్డు ద్వారా భవిష్యత్తులో వారికి మెడికవర్ హాస్పిటల్‌లో వివిధ వైద్య సేవలను సులభంగా పొందే అవకాశం కల్పించబడిందని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి ఆర్థోపెడిక్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను సంయుక్తంగా కొనసాగిస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >