| Daily భారత్
Logo




గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెట్స్ ఆరంబ్ కార్యక్రమం

News

Posted on 2026-01-26 12:44:15

Share: Share


గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెట్స్ ఆరంబ్ కార్యక్రమం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లోని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం లెట్స్ ఆరంబ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఇలాంటి ఉన్నత చదువులు చదువుకున్న ఆర్యవైశ్యులు సంఘ సేవా కార్యక్రమాల్లో సహాయం అందించేందుకు ముందుండాలని ఆయన అన్నారు. అలాగే పేద ఆర్యవైశ్యుల  వ్యాపారం పరంగా మెలకువలు రాణించడానికి  ఈ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సభ్యులు ఆర్థికపరంగా ముందుకు రావడం అభినందనీయం అన్నారు.  ఆర్యవైశ్యులు సమాజంలో అంటేనే సేవ మానవత్వానికి ప్రతీకలని ఆయన అన్నారు. అందుకే పేద ఆర్యవైశ్యులను వ్యాపారాలు చేయడానికి ముందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన ట్రస్టు ద్వారా కూడా ఆర్యవైశ్యులకు వ్యాపారం నిమిత్తం ఆదుకునేందుకు సహా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అలాగే ఉద్యోగాలతో పాటు వ్యాపారాలలో రాణించాలని ఉత్సాహం ఉన్న యువతకు అసోసియేషన్ ఆధ్వర్యంలో దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు . ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుట్ల నవీన్, కార్యదర్శి గందె శ్రీనివాస్ , కోశాధికారి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >