Posted on 2026-01-11 12:28:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని భగవాన్దాస్ కాలనీ లో నేషనల్ యూత్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ కాలనీలో ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భద్రాచలం సీఐ నాగరాజు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సేవ్ భద్రాచలం యూత్ అనే సామజిక అవగాహన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. సీఐ నాగరాజు ఆటగాళ్లతో కొంచెం సేపు బాడ్మిటన్ ఆడి ఆటగాళ్ళను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తితో పాటు సమాజం పై అవగాహన పెంచే కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. భద్రాచలం పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మకం లేదా కొనుగోలు చేస్తే తన పర్సనల్ నంబర్‌కు నేరుగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గంజాయి బాధితుల కు రక్షణ ఫౌండేషన్ ద్వారా కౌన్సిలింగ్ అందించి తగిన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై స్వప్న మాట్లాడుతూ, మొబైల్ అడిక్షన్ కూడా యువత భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. సోషల్ మీడియా రీల్స్ వల్ల యువత తప్పుదారి పడే అవకాశం ఉందని, అలాంటి వాటికి దూరంగా ఉండి క్రీడలు, చదువు ద్వారా భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ దిశగా రక్షణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగ పడతాయని ఆమె పేర్కొన్నారు. సమాజ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్న డిపో యూత్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుంజా ధర్మారావు,భూక్యా రంగ, చింతిర్యాల రవి, సున్నం భూలక్ష్మి, డా. మల్లేష్, టోర్నమెంట్ నిర్వాహకులు కుంజా సంతోష్, తాళ్ళ రమేష్, తాళ్ళ నాగరాజు, బోళ్ళ కృష్ణ, శీలం నాగరాజు, బత్తుల రమేష్, నరేందర్, బాలు, ఆనంద్, తాళ్ళ శివ, సున్నం వినోద్, కణితి నవీన్, యాలం సురేష్, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >