Posted on 2026-01-05 16:19:41
రూ.2,50,000 బాండ్ అందించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ద్వారా మంజూరైన కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జక్కుల ప్రియాంక కులాంతర వివాహం చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహక కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు అయిన రూ. 2,50,000 విలువైన ఫిక్స్డ్ బాండ్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో సోమవారం జక్కుల ప్రియాంక కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. జిల్లాలో ఇప్పటిదాకా 180 దరఖాస్తులు రాగా, 57 మందికి రూ.1 కోటి 42 లక్షల 60 వేలు పంపిణీ చేశా మని, మరో 11 మందికి త్వరలో నే ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్లను పంపిణీ చేస్తామని, మిగతా వారికి ఎస్సీ కమిషన ర్ నుంచి మంజూరు అయిన తర్వాత ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >