Posted on 2026-01-05 16:14:44
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం...కారు ఢీకొని హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని క్రషర్ వద్ద వేగంగా వచ్చిన కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి కారు ఢీకొట్టడం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టగా, బైక్‌పై ప్రయాణిస్తున్న హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పట్టణ సిఐ కృష్ణలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, స్వయంగా పోలీస్ వాహనంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బందిని కోల్పోవడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >