Posted on 2026-01-03 16:24:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3.51 లక్షల లంచం తీసుకుంటుండగా.. అటవీ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొత్తగూడెం అటవీ సబ్-డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాల కృష్ణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి సుమారు 3,900 టున్నల నీలగిరి చెట్లను నరికివేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ. 3.51 లక్షల లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి శనివారం రూ.3.51 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి గోపాల కృష్ణ సూచనల మేరకు జోగు చెన్నారావు అనే వ్యక్తి లంచం మొత్తం రూ. 3,51,000 తీసుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు ఈ కేసులో రాజేందర్, గోపాల కృష్ణను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు తాటి శ్రావణి పరారీలో ఉన్నారు. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >