డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:జూలూరుపాడు మండలంలో గ్రామ సర్పంచులు కలిసి కొత్త సర్పంచుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూక్య ప్రసాద్ను మండల అధ్యక్షుడిగా, బానోత్ సుమలతను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
కమిటీ సభ్యులు...
ప్రధాన కార్యదర్శులుగా కొర్సా రమేష్, తాటి సువార్త, జాయింట్ కార్యదర్శులుగా బానోత్ కృష్ణ, సంఘం లక్ష్మి కుమారి, కోశాధికారిగా గంగావత్ నవీన్, ప్రచార కార్యదర్శిగా భూక్య చంద్రబాబు ఎన్నికయ్యారు. చింతా జగన్నాధం, లాకావత్ రెడ్డి గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.
మొత్తం 10 మందితో కమిటీ ఏర్పడింది. ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల అమలుకు సంఘం కృషి చేస్తుందని నూతన అధ్యక్షుడు భూక్య ప్రసాద్ అన్నారు.