Posted on 2026-08-11 14:02:10
జిల్లా బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ.
పెద్ద ఎత్తున జరిగిన ర్యాలీలో కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది జీవీకే మనోహర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందేమాతరం నినాదాలతో కొత్తగూడెం పట్టణ వీధులు మార్మోగిపోయాయి.
డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర, రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు "హర్ ఘర్ తిరంగా" భారీ ర్యాలీలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభసమయాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ పెద్ద ఎత్తున జరిగింది. మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీదర్ రెడ్డి జాతీయ జెండాను ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ప్రకాశం స్టేడియం గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర వందలాదిమంది విద్యార్థిని విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్, అండర్ గ్రౌండ్, సింగరేణి సూపర్ బజార్ సెంటర్ లేదుగా గణేష్ టెంపుల్ సెంటర్, ఓల్డ్ డిపో సెంటర్, గోధుమ వాగు బ్రిడ్జి పైనుండి లక్ష్మీదేవి పల్లి వరకు జరిగింది. అయితే ఈ యాత్ర ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగరాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తిరంగా ర్యాలీని విజయవంతం చేయడానికి భారీ ర్యాలీలు, తిరంగా యాత్రలు చేపట్టడం జరిగింది. దేశభక్తిని పునరుద్ఘాటిస్తూ, "వికసిత భారత్", "ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్" సంకల్పాన్ని చాటిచెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని బిజెపి నేతల పేర్కొన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాలలో బిజేవైఎం, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంతో భారీ తిరంగా ర్యాలీలు, బైక్ యాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
పార్టీలకతీతంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ "తిరంగా యాత్ర" ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను విస్మరించి భారతీయులందరూ ఐక్యంగా పాల్గొనాల్సిన జాతీయ పండుగన్నారు. "మన త్రివర్ణ పతాకం భారతదేశ ఆత్మగౌరవానికి, ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకని పేర్కొన్నారు.ఈ తిరంగా యాత్ర ద్వారా జాతీయ సమైక్యతను చాటి చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, భోగి కృష్ణ, బిక్షపతి, హర్ ఘర్ తిరంగా కన్వీనర్ గోపి, కో కన్వీనర్ కోల హరీష్, నరేష్, జిల్లా కార్యదర్శులు పుణ్యా నాయక్, మురళి, దురిశెట్టి కుమార్, వీర మధుసూదన్, భీమల్ జైన్, జిల్లా కోశాధికారి ముకుంద రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు భాగ్యలక్ష్మి, భూక్య దివ్యశ్రీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మోహనకృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి, కిషన్ మోర్చా అధ్యక్షులు దుర్గా శ్రీనివాసరావు, కృష్ణ ఓబిసి మోర్చా అధ్యక్షులు జటంగి కృష్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాపల మడుగు రాకేష్ బాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు జటంగి కృష్ణ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు రహీం, మీడియా కన్వీనర్ రామారావు, దార్మిక సెల్ కన్వీనర్ కస్తూరి సుధాకర్, లేబర్ సెల్ కన్వీనర్ గుమలాపురం సత్యనారాయణ వివిధ మండలాధ్యక్షులు, బిజెపి కార్యకర్తలు, అభిమానులు విద్యార్థి, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >