| Daily భారత్
Logo




సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

News

Posted on 2026-08-12 10:06:43

Share: Share


సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

ప్రభుత్వ ఆర్డర్లు, ప్రైవేట్ జేబులు: సిరిసిల్ల పవర్‌లూమ్ సొసైటీల్లో భారీ అవకతవకలా?

మ్యాక్స్ చట్టానికి తూట్లు: సిరిసిల్లలో 16 సొసైటీల రద్దుకు డిమాండ్ చేసిన బీజేపీ

కార్మికుల కూలీ, పెట్టుబడిదారుడి లాభం: సిరిసిల్ల మ్యాక్స్ సొసైటీలపై సంచలన ఫిర్యాదు

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 16 పవర్‌లూమ్ మ్యాక్స్ సొసైటీల నిర్వహణలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని సిరిసిల్ల పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆరోపించారు. 

బుధవారం అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆయన, సిరిసిల్లలోని 16 మ్యాక్స్ సొసైటీలను స్థానిక పెట్టుబడిదారుడు మంచే శ్రీనివాస్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆరోపణల సారాంశం ఇలా ఉంది:

ప్రభుత్వం నుండి సిరిసిల్ల మ్యాక్స్ సొసైటీలకు వచ్చే ఆర్డర్లను, పై 16 సంఘాల పేరిట తీసుకుంటున్నారని. అయితే ఆ సంఘాలకు సంబంధించిన బైలా, అకౌంట్స్, చెక్ బుక్స్ అన్నీ మంచే శ్రీనివాస్ వద్దే ఉంటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వం చెల్లించే డబ్బును నేరుగా ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేసి, అందులో నుండి నూలు కొనుగోలు చేసి బట్ట తయారు చేయిస్తున్నారని. తయారైన బట్టను ప్రభుత్వానికి సప్లై చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని తిరిగి తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఆసాములు, కార్మికులకు కేవలం కూలీ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.

అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తూ, పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చట్ట ఉల్లంఘన ఆరోపణ

R.C.No: 06/2022-BTKS తేదీ: 21-03-2023 నాటి సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ సర్కులర్ ప్రకారం, పైన పేర్కొన్న 16 సంఘాలు ఏవీ కూడా మ్యాక్స్ చట్టం-1995 నిబంధనలను పాటించడం లేదని నాగుల శ్రీనివాస్ అన్నారు. కాబట్టి ఆ సంఘాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.

ఈ 16 సొసైటీల వివరాలు:

పద్మనగర్‌లో శ్రీ దత్తాత్రేయ, అయ్యప్ప, భవాని; B.Y. నగర్‌లో శ్రీ సద్గురు, దేవీ, క్రాంతి, దుర్గామాత; అంబికా నగర్‌లో రాజీవ్, వెంకటేశ్వర; రాజీవ్ నగర్‌లో భవాని, నిఖిల్; శివనగర్‌లో వేద వ్యాస, శివనగర్, హయగ్రీవ, శ్రీనివాస; చంద్రంపేట్‌లో మహేశ్వర పవర్‌లూమ్ మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కోడం రవి, సూరం వినయ్, పట్టణ అధికార ప్రతినిధి దూడం సురేష్, దాసరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >