| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

డైలీ భారత్, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజారోగ్య సేవలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ముందుగా గంభీరావుపేట PHC పరిధిలోని NQAS గుర్తింపు పొందిన బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను సందర్శించారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల స్టాక్, ల్యాబ్ టెస్టులు, రికార్డులు, పారిశుద్ధ్యంపై ఆరా తీశారు. NQAS ప్రమాణాల ప్రకారం నాణ్యమైన సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

అనంతరం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ చేశారు. OP, IP, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, OT, ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ, బయోమెడికల్ వేస్ట్, రోగుల రికార్డులు, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పరికరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా DMHO కీలక సూచనలు చేశారు:

తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం మరియు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

రోగులకు నాణ్యమైన, పారదర్శక వైద్యం అందించాలి. అవసరం లేని టెస్టులు, ఆపరేషన్లు చేయొద్దు  

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి. గర్భిణులు, నవజాత శిశువులకు ప్రమాణాల ప్రకారం సేవలు ఉండాలి

ఆసుపత్రి పరిశుభ్రత, రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

ఈ తనిఖీల్లో డిప్యూటీ DMHO డాక్టర్ నాగేంద్ర బాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, PHC MO డాక్టర్ సరియ అంజుమ్ పాల్గొన్నారు.

#Sircilla #DMHO #HealthNews #Telangana #PrivateHospitals #AyushmanArogyaMandir

Previous సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...
Next రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
ADVERTISEMENT