Posted on 2026-01-03 13:22:41
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగిన శాసన పరిషత్తు 25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్ వరకు ఉద్యోగుల తో కలిసి వారు అనునిత్యం శాంతి భద్రతల కోసం తపిస్తూ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. అసలు పోలిసు శాఖ లో ముందుండి పని చేసేది హోంగార్డు లేదని ఆయన అన్నారు. ఇలా కష్టపడే హోంగార్డులు వేతనాలు, ఇతర ప్రభుత్వ ద్వారా అందే సదుపాయాల పొందడం కోసం కష్టాల పాలవుతున్నారని ఆయన చెప్పారు. చివరకు వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ పరిస్థితిలో సైతం వారు కష్టపడుతుంటే పట్టించుకునే వారు కరువై నట్లు వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర మంత్రి హజరుద్దీన్ హోం గార్డుల సమస్యలను పరిష్కరిస్తామని అందుకు సీఎంకు నివేదిస్తానని హామీ ఇచ్చారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >