Posted on 2025-12-28 15:51:59
ఇవాళ 129వ మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ
డైలీ భారత్ తెలంగాణ డెస్క్ : కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో ప్రారంభమైన 2025 సంవత్సరం భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి ప్రతి అంశంలో ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో బలమైన ముద్ర వేసిందన్నారు.
మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. 2025 సంవత్సరంలోని అంశాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారడానికి ఎన్నో క్షణాలను ఇచ్చిందని ఆపరేషన్ సిందూర్ మారుతున్న భారతావనిగా అభివర్ణించిన మోడీ.. సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‍తో నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచం స్పష్టంగా చూస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు అదే స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని చూపించినందుకు మోడీ అభినందించారు.
వికసిత్ భారత్ ద్వారా దేశం అన్ని విభాగాల్లో ముందుకెళ్తోందని మోడీ చెప్పారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సు జనవరి 12న జరగనుందని ఇందులో వివిధ ప్రాంతాల యువత తమ ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో నేనూ తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారని స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారన్నారు. 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహిళల అంధుల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత కుమార్తెలు చరిత్ర సృష్టించారని మోడీ ప్రశంసించారు. ఆసియా కప్ T20లో త్రివర్ణ పతాకం కూడా గర్వంతో రెపరెపలాడిందని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు గెలుచుకున్నందుకు పారా-అథ్లెట్లను కూడా ఆయన ప్రశంసించారు. గతేడాది వారణాసిలో కాశీ-తమిళ సంగమం జరుపుకున్నాం.వారణాసిలోని పిల్లలు తమిళం మాట్లాడుతున్నారు. మాతృభాష హిందీ అయినప్పటికీ తమిళం నేర్చుకుని మాట్లాడుతున్నారన్నారు. దేశంలో చిరుతల సంఖ్య 30 దాటిందని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, వోకల్ ఫర్ లోకల్ దేశీయ ఉత్పుత్తుల ప్రోత్సాహం వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >