Posted on 2025-12-28 14:13:22
చంద్రంపేట మూలమలుపు వద్ద హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టిన గణేష్ బోర్వెల్ వాహనం
డైలీ భారత్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట మూలమలుపు వద్ద ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన "బోర్వెల్" వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ ఆలయాన్ని బలంగా ఢీకొట్టింది. బోర్వెల్ వాహనం వేగానికి ఆలయ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఆలయం వద్ద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కావడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు సాధారణంగా ఈ మూలమలుపు వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. ముఖ్యంగా జీవనోపాధి కోసం ఎంతోమంది ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ ఉంటారు.
బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఎప్పుడూ ఇక్కడ గుంపులుగా ఉంటారు. అయితే, ఈరోజు ఆదివారం కావడం, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ రద్దీ సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ మలుపు వద్ద తరచూ వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >