| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రిటైర్డ్ ఉపాధ్యాయిని మాదిరెడ్డి అంజనా దేవి ఔదార్యం

రిటైర్డ్ ఉపాధ్యాయిని మాదిరెడ్డి  అంజనా దేవి ఔదార్యం

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల లోని ZPHS అంబేద్కర్ నగర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-I పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతి తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థిని విద్యార్థులకు  ₹1000, 500 రూపాయల చొప్పున నగదు బహుమతులు ఇచ్చారు. మొత్తం 7,500 రూపాయలు నగదు రూపేణా విద్యార్థులకు  బహుమతినిచ్చారు. ప్రజా ప్రతినిధి దార్ణం అరుణ మాట్లాడుతూ తాను మాదిరెడ్డి అంజనా దేవి శిష్యురాలినని, విద్యార్థులకు విద్యలో పోటీ తత్వం పెంచడానికి, విద్యా పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఈ బహుమతి ప్రదానం చేయడం చాలా గొప్ప విషయమని, విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి మాట్లాడుతూ ఇలా ఉద్యోగ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నగదు పురస్కారం ఇవ్వడం చాలా ప్రశంశనీయమని, వారిలో గుణాత్మకమైన మార్పును ఆశిస్తూ చేసిన ఈ పనిని ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు పత్తిపాక శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పొలాస మల్లేశం ఐత సత్యనారాయణ, బి మంజుల, ఎస్ రమాదేవి, గూడూర్ రవికుమార్, పరకాల రవీందర్, బాలి గంగాభవాని, సిరిపురం జ్యోతి,  తల్లిదండ్రులు మరియు విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

Previous అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
Next ప్రభుత్వ విద్యుత్తు.. వ్యక్తిగత వాడకం
ADVERTISEMENT