Posted on 2025-12-27 13:42:25
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శనివారం ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అబ్దుల్ అజీజ్ మహమ్మద్, ఉపసర్పంచ్ బాస్పల్లి బాలకృష్ణ, వార్డుమెంబర్లు ప్రభాకర్, అనిల్ గౌడ్, డేవిడ్, చిట్టి రాజు, గీతా శ్రీనివాస్ వారి అనుచరులు పది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారు అన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. పార్టీలోకి వస్తున్న నాయకులు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పార్టీ ప్రభుత్వ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >