Posted on 2025-12-26 07:29:45
డైలీ భారత్, స్పెషల్:
నూతన సంవత్సరం 2026
అన్నమో రామచంద్రా అని
అడుకుంటున్న అభాగ్యుల ఆకలికేకలు
పక్కన పెట్టి నూతన సంవత్సర
వేడుకల్లో పాల్గొందామా
రైతన్న ఉరి కొయ్య ఉయ్యాలలో
ఉగుతూ వుంటే నూతన సంవత్సర
వేడుకల్లో పాల్గొందామా
పొగ గొట్టంలో నల్లటి భూతం
పకృతి మాతను కప్పెస్తుంటే
నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేసుకుందామా
బాణాసంచాలు పేలుస్తు
పెద్ధ పెద్ధ శబ్ధాలు చేస్తూ
పకృతికి మరియు సాటివారికి
హాని కలిగిస్తూ వుంటే
నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేసుకుందామా
ప్రాచ్యత దేశ వ్యామోహంలో పడి
మన సంప్రదాయాలను మరచి
కేకులు పబ్బులు అంటూ
నూతన సంవత్సర
వేడుకల్లో పాల్గొందామా
ఒక్కసారి ఆలోచిస్తారని ఆశిస్తూ
అభాగ్యుల ఆకలికేకలు
కొంతమేర చల్లారుస్తారని ఆశిస్తూ
తప్పులు వుంటే మన్నిస్తారని ఆశిస్తూ
మీ,
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >