Posted on 2025-12-25 06:25:17
డైలీ భారత్ న్యూస్, కర్నాటక:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మందికి ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
సీబర్డ్ ట్రావెల్స్ కు చెందిన ఈ స్లీపర్ కోచ్ బస్సు అది. 30 మంది ప్రయాణికులతో బుధవారం 8:25 గంటలకు బెంగళూరులోని గాంధీనగర్ నుంచి గోకర్ణకు బస్సు బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణ, ఇద్దరు శివమొగ్గ, ఇద్దరు కుమటాకు చేరుకోవాల్సి ఉంది. వేకువజామున సుమారు 2:45 నిమిషాల ప్రాంతంలో చిత్రదుర్గ జిల్లాలో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 48పై హిరియూర్ సమీపంలోని జవనగొండనహళ్లి-గోరట్లు క్రాస్ వద్ద అదుపు తప్పింది. ఓ భారీ కంటైనర్ ను అతివేగంగా ఢీ కొట్టింది.
ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఢీకొన్న తీవ్రతకు క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. కంటైనర్ సైతం మంటలబారిన పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటపడే అవకాశమే వారికి లభించలేదు.
అకస్మాత్తుగా చెలరేగిన మంటల నుండి 10 మంది కాలిన గాయాలతో కిటికీ అద్దాలను పగులగొట్టి బయటికి రాగలిగారు. మంటల ఉధృతికి బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్రంగా శ్రమించారు.
గాయపడిన ప్రయాణికులను తక్షణమే అంబులెన్స్‌ల సాయంతో చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన కారణంగా జాతీయ రహదారి 48పై జవనగొండనహళ్లి వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శిరా మరియు హిరియూర్ మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >