| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్న దొంగలు

వరస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్న దొంగలు

ఇండ్లే కాకుండా ఆలయాలను సైతం వీడని దుండగులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు  ప్రజలకు, పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్నారు దొంగలు. ప్రముఖ ప్రాచీన ఆలయాలను సైతం వదలడం లేదు. తాజాగా ఇలాంటి ఘటననే జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్వయంభు శంభుని గుడిలో పట్టపగలు ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడ దూకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామాగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఓ దుండగుడు నగరంలోని హైమది బజార్ ప్రాంతంలో గల శంభుని గుడి గోడ దూకి లోనికి వచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న వెండి హారతి పల్లాలు, శత గోపురం, ఇత్తడి పూజ సామాగ్రి, పంచలోహ హారతి పళ్లెం, రాగి ప్లేట్లు దోచుకుని పరారయ్యాడు. సాయంత్రం సమయంలో పూజారి వచ్చి ఆలయం ప్రధాన గేటు తెరిచి లోనికి వెళ్లగా అక్కడ ఉన్న పూజ సామాగ్రి కనబడకపోవడంతో  పూజారి ఆలయ చైర్మన్ బింగి మధుకు సమాచారం అందించాడు. ఈ జోరీ విషయమై సంబంధిత రెండు అవటం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఎస్సై ముజాహిద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుడు ఆలయం గోడ దూకి లోపటికి వెళ్లి చోరీ చేసిన అనంతరం తిరిగి వెళ్లే దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగిలించిన ఆలయ పూజ సామాగ్రిని కొనుగోలు చేసిన వ్యాపారి ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీ మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే ఓ వ్యాపారి దొంగ కు కేవలం 200 రూపాయలు ముట్టజెప్పి పూజ సామాగ్రిని తీసుకున్నట్లు పోలీసులకు విచారణలో తేలింది. ఈ చోరీ ఘటనపై ఆలయ పూజారి రాజ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా ఆలయంలో చోరీకి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Previous ఘోర రోడ్డు ప్రమాదం- 17 మంది సజీవదహనం
Next మస్జిద్ సేవకులకు శీతాకాల దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ హర్షనీయం
ADVERTISEMENT