| Daily భారత్
Logo




తీగ లాగితే డొంక కదులుతున్న డీటీసీ కిషన్ నాయక్ అక్రమాల చిట్టా..

News

Posted on 2025-12-24 15:36:00

Share: Share


తీగ లాగితే డొంక కదులుతున్న  డీటీసీ కిషన్ నాయక్  అక్రమాల చిట్టా..

అనిసా అధికారుల సోదాలలో బట్టబయలైన  200 కోట్ల ఆస్తులు, మూడు కిలోల బంగారం..

బ్యాంక్ లాకరులో మరో కిలోన్నర బంగారం...

అజ్ఞాతంలోకి వెళ్లిన డిటిసి కిషన్ నాయక్ డ్రైవర్..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లాకు చెందిన డీటీసీ కిషన్‌ నాయక్‌ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో  డిటిసి అక్రమస్తులు భారీగా బయటపడటంతో అధికారులను విస్మయానికి గురిచేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న  ఆరోపణల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో పనిచేస్తున్న రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఆర్ఆర్‌నగర్‌లోగల ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  ఈ సోదాలలో 200 కోట్ల ఆస్తులతో పాటు మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ముందే పసిగట్టిన  డీటీసీ కిషన్ నాయక్ తన డ్రైవర్ శివ శంకర్ ద్వారా  భారీగా అక్రమస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు, భారీగా నగదు  తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం శివశంకర్  అజ్ఞాతంలో ఉండడంతో  అతని కొరకు ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతను పట్టుబడితే మరిన్ని భారీ ఆస్తులు, నగదు  బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ను పరిశీలించగా వాటి విలువ   బహిరంగ మార్కెట్‌లో దాదాపు 200  కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. పెట్రోల్‌ బంక్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్థిర, చరాస్తులతో పాటు, బ్యాంక్ లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. కిషన్‌ నాయక్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.ఏసీబీ అధికారులు 15 బృందాలుకు పైగా ఏర్పడి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌లలో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్‌ హోటల్‌, రాయల్ ఓక్‌ బిల్డింగ్‌, పది ఎకరాల పొలం  కిషన్‌ నాయక్‌కు చెందినవిగా గుర్తించారు.మెదక్,నారాయణ్ ఖేడ్ లలో అక్రమ ఆస్తులు గుర్తించి వాటి డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు.

వీటితో పాటు కిషన్ నాయక్ స్నేహితుల ఇండ్లలో అక్రమ ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నట్లు  గుర్తించి  స్వాధీనం చేసుకున్నారు. డీటీసీ కిషన్ నాయక్  అక్రమస్తుల పుట్ట  తప్పిన కొద్ది బయట పడుతుంది. అతని అక్రమస్తులను చూసి సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులే  ఆశ్చర్యపోతున్నారు. రెండవ రోజు కూడా వివిధ ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >