| Daily భారత్
Logo




అగ్రవర్ణ రాజకీయ నేతలు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై వివక్ష వహించడం దుర్మార్గ చర్య

News

Posted on 2025-12-21 15:54:50

Share: Share


అగ్రవర్ణ రాజకీయ నేతలు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై వివక్ష వహించడం దుర్మార్గ చర్య

రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదంపై హర్షం

మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై మాట్లాడుతూ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామాల్లోని సామాన్య ప్రజల విద్యకు, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంనాటి బానిస సాంస్కృతిని మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మురం చేస్తూ దారిద్ర్యం లోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలు సంఘటిత మై చారిత్రక,సామాజిక సాంస్కృతిక,రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటి పై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్.నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చిలుక భాస్కర్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >