| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

న్యాయవాదిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి 

బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్

డైలీ భారత్, వేములవాడ: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన న్యాయవాది మల్లయ్యను కొందరు దుండగులు  దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, ప్రధాన ద్వారం నినాదాలతో  నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ న్యాయవాదిని హత్య చేసిన దుండగుల కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పొత్తూరు అనిల్ కుమార్, గుండ రవి, పెంట రాజు, న్యాయవాదులు రేగుల దేవేందర్, పర్లపెల్లి అంజయ్య, నక్క దివాకర్, మాదాసు దేవయ్య, జెట్టి శేఖర్, కనికరపు శ్రీనివాస్, గుజ్జే మనోహర్, నేదూరి అభిలాష్, బీమా మహేష్ బాబు, ఒద్యారపు వేణు కుమార్, వడ్లకొండ శ్రీకాంత్, పొత్తూరు మల్లేశం, వంగ పర్శరాములు, గోపు మధు తదితరులు పాల్గొన్నారు..

Previous 170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Next యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
ADVERTISEMENT