| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

డైలీ భారత్, చంద్రంపేట: సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగను అంగరంగ వైభవంగా సోమవారం రోజున జరుపుకున్నారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థినిలు,  పోతురాజు వేషధారణలో అబ్బాయిలు ఈ బోనాల పండుగలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి , సమృద్ధిగా వర్షాలు కురవాలని, చేతినిండా పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు చంద్రంపేట పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చక్కని విద్యాబుద్ధులు, సత్ప్రవర్తన నేర్చుకుంటారని ,మంచి ఫలితాలను సాధిస్తారని ,  ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని భవిష్యవాణి పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి పాటలకు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఈ వేడుకలలో స్థానిక  కౌన్సిలర్ మొగిలి నాగరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ, ఏఏపీసీ చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ,ఓద్యారం మధుసూదని,అనిల్ కుమార్,మిరియం, త్రివేణి , లత  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Previous హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"
Next వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
ADVERTISEMENT