| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

డైలీ భారత్, లక్నో: వివాహేతర సంబంధం అడ్డు వస్తుందని భావించి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన లక్నోలో చోటుచేసుకుంది. ప్రియురాలితో కలిసి భార్యను గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని గోమతీ నదిలో పడేసిన క్యాబ్ డ్రైవర్ ను, అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాధితురాలు అంజలి సింగ్ నిందితులు ఆమె భర్త ఉమేంద్ర ప్రతాప్ సింగ్ మరియు అతని ప్రియురాలు ఆర్తీ వర్మ

పోలీసుల వివరాల ప్రకారం, 7 నెలల క్రితం క్యాబ్ రైడ్ సమయంలో ఉమేంద్రకు ఆర్తీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసి అంజలి అభ్యంతరం చెప్పడంతో ఇంట్లో గొడవలు పెరిగాయి.

దీంతో ఉమేంద్ర, ఆర్తీ కలిసి అంజలిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు అంజలిని గొంతు నులిమి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కారులో తీసుకెళ్లి గోమతీ నదిలో పడేశారు.

పోలీసుల అనుమానం రాకుండా ఉండేందుకు ఉమేంద్ర పోలీస్ స్టేషన్ కు వెళ్లి "భార్య మిస్సింగ్" అంటూ ఫిర్యాదు కూడా ఇచ్చాడు. అయితే జూలై 31న గోమతీ నదిలో లభించిన మృతదేహాన్ని అంజలి కుటుంబ సభ్యులు గుర్తించడంతో అసలు విషయం బయటపడింది.

అంజలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, ఉమేంద్ర తన భార్య నగలను ఆర్తీకి ఇచ్చినట్లు తేలింది. ఆ నగల విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. 

పోలీసులు నిందితుల నుంచి నగలు, హత్యకు వాడిన కారు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమేంద్రపై 2020లో హర్దోయ్ జిల్లాలోనూ కేసు ఉందని పోలీసులు చెప్పారు. 

ప్రస్తుతం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించి, కేసుపై మరింత విచారణ చేస్తున్నారు.

 #Lucknow News, #Gomti River Murder, #Husband Killed Wife, #Extra Marital Affair, #UP Crime News

Previous వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Next 170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
ADVERTISEMENT