Posted on 2025-12-21 13:04:15
కర్ల రాజేష్ మృతిపై నోరు ఇప్పని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
డైలీ భారత్ న్యూస్, చిలుకూరు:ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చిలుకూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లేపంగు సూరిబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ హుజూర్ నగర్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగలు హాజరయ్యారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిలుకూరు ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
ప్రయత్నం మానాలని హితవు పలికారు. రాజేష్ పై చిత్రహింసలకు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులందరి మీద హత్యా నేరం మోపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతిరాల నాగయ్య,మీసాల శరత్ బాబు, మంద వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ మండల అధ్యక్షులు గుండెపొంగు బాబు, పట్టణ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు రవీంద్ర, ఉపాధ్యక్షులు మేళ్లచెరువు సురేష్, మెరుగ క్రాంతి, రేడపంగు రాజేష్, మెరిగ సాయి, సోమపంగు వెంకట్, కస్తాల నరసింహా రావు, గల్లా నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >