| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోడర్న్ కబడ్డీ జిల్లా స్థాయి సెలెక్షన్స్ విజయవంతం

News

Posted on 2025-12-21 15:33:02

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోడర్న్ కబడ్డీ జిల్లా స్థాయి సెలెక్షన్స్ విజయవంతం

డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మోడర్న్ కబడ్డీ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు, వార్డు మెంబర్ కార్తీక్, జంకే లావణ్య, మల్లేశం హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మోడర్న్ కబడ్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్, కార్యవర్గ సభ్యులు విక్కుర్తి అంజయ్య, సందేల నరేష్, చిలుక ప్రభాకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

జిల్లా స్థాయి సెలెక్షన్స్ సందర్భంగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు అమ్మగారి జ్ఞాపకార్థంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు రూ.10,000/- విలువ గల జెర్సీలను అందజేశారు.

ఈ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుండి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి మోడర్న్ కబడ్డీ క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ తెలిపారు.

Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >