కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు ని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన వ్యక్తికి అక్కడే విధులు నిర్వహిస్తున్న గంగారాజు,శ్రీనివాస్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు
ఈరోజు ఉదయం నాంపెళ్లి గ్రామానికి చెందిన రమేష్ , age49 అనే వ్యక్తి తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలగా అక్కడే విధులలో ఉన్న కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కానిస్టేబుల్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ శ్రీనివాస్,గంగారాజు లను నెటిజన్లు అభినందిస్తున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.