| Daily భారత్
Logo




దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Devotional

Posted on 2025-12-09 06:56:29

Share: Share


దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: మీరు తరచూ దేవాలయాల్లో హుండిలో కానుకలు సమర్పిస్తుంటారు. కానీ నిజానికి మన పురాణాల్లో ఎక్కడా ఇలా హుండీలో డబ్బులు వెయ్యమని చెప్పలేదు, దాన ధర్మాలే చెయ్యమన్నారు.

మీ మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండిలో లక్షలు లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా?

మరైతే మనం ఏం చేయాలి, ఇలా లక్షలు హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో చూద్దాం రండి.

ఐతే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం

తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటవ అధ్యాయం మనకు వివరిస్తుంది.

దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది.

అందుకే ఎవరి చేతనైనంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందిచాలని అంటున్నాయి పురాణాలు.

* దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి అలాగే ప్రాగంణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీమహావిష్ణువు లోకఫలాలను పొందుతారని పురణాలు చెప్తున్నాయి.

* ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతారు.

* ఆలయానికి గంటను దానం చేస్తే మహ గొప్ప కీర్తివంతుడు అవుతాడు.

* గజ్జెలను, మువ్వలను  దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు.

* ఆలయ ప్రాంగణంలో చల్లధనం కోసం పందిళ్ళు  నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మ బుద్ది కలగడానికి కారణమవుతాడు.

* దేవాలయం పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాలనుండి విముక్తి పొందినవాడై వాయు లోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు.

* ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృధ్వీపతి అవుతారు.

* మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు.

* నాలుగు కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పరియంతం ఉన్న, భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు.

* కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు.

* వట్టి వేళ్ళతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి.

* ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి, మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించినపాడికి పాపవిముక్తి కలుగును.

* కాపరాలను దానం చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు.

* ధ్వజ స్థంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు.

* దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములను తొగిడు సుగంధ ద్రవ్యాలను సమర్పించినవాడు ఉత్తమ రూప సంపదత్తిని పొందుతాడు.

Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >