Posted on 2025-12-05 07:51:15
తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లోకి బడంగ్ పేట కార్పొరేషన్
పాలన సౌలభ్యం కోసం మాత్రమే పాత జోన్ల పరిధిలోకి
ప్రజల అభిష్టానం మేరకే ప్రజాపాలన కొనసాగుతుంది
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్ న్యూస్, రంగరెడ్డి జిల్లా : జిహెచ్ఎంసిలో విలీనం చేసిన శివారు మున్సిపాలిటీలకు కొత్త జోన్లు ఏర్పాటు చేసే వరకు పాత జోన్లల్లో కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ ను తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లో విలీనం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
పాలన సౌలభ్యం కోసమే 27 పురపాలికలను అందుబాటులో ఉన్న సర్కిల్స్, జోన్ల పరిధిలోకి తెచ్చామని లక్ష్మారెడ్డి అన్నారు.
బడంగ్ పేట కార్పొరేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త జోన్ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు బడంగ్ పేట కార్పొరేషన్ విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. ప్రజల అభిష్టం మేరకు తప్పకుండా బడంగ్ పేట కార్పొరేషన్ ను ఛార్మినార్ జోన్ నుంచి మార్చుతామని... త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జోన్ లోకి వస్తుందన్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ నాయకులకు జోన్లు, సర్కిల్స్, విలీన ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >