| Daily భారత్
Logo




జిల్లావ్యాప్తంగా దిగంబరా దిగంబరా దత్తాత్రేయ నామస్మరణలతో మార్మోగిన దత్తాత్రేయ ఆలయాలు

News

Posted on 2025-12-04 16:47:31

Share: Share


జిల్లావ్యాప్తంగా దిగంబరా దిగంబరా దత్తాత్రేయ నామస్మరణలతో మార్మోగిన దత్తాత్రేయ ఆలయాలు

దత్తాత్రేయుని ఆలయాల్లో పోటెత్తిన భక్తులు పోటెత్తిన భక్తులు

జిల్లా కేంద్రంలోని సద్గురు దామము సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దత్తాత్రేయునికి ఎంతో ప్రీతికరమైన నామస్మరణం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే శ్లోకంతో దత్త పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దత్తాత్రేయుని జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో 100 ఫీట్ రోడ్లో గల శ్రీ సద్గురు దామం సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పకాయల హరిదాస్ స్వామీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుండి ఉత్సవాలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో సామూహిక యజ్ఞ హోమం కార్యక్రమాలు, శ్రీ అనఘా దత్తాత్రేయునికి తెల్లవారుజామున నుండి ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. దత్త జయంతి రోజున దత్తాత్రేయుని స్వయంగా పూజిస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకే గురువారం దత్త జయంతి దత్త పౌర్ణమి కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి దూలారహోనంతో పాటు వివిధ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ట్రస్టు సభ్యులు ఎమ్మెల్యేకు సన్మానించారు. అనంతరం భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >