Posted on 2025-11-29 16:29:43
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ పీపుల్స్ వార్ గ్రూప్ దళ కమాండర్ బల్లెపు నరసయ్య @ సిద్దయ్య @ బాపిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు జక్కుల సంతోష్ ని అరెస్ట్ రిమాండ్ చేసినట్లు వేములవాడ ఇంచార్జ్ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
ఈసందర్భంగా ఇంచార్జ్ డిఎస్పీ మాట్లాడుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం గండి లచ్చపెట్ గ్రామానికి చెందిన బల్లెపు నర్సయ్య @సిద్దయ్య@బాపిరెడ్డి అనే వ్యక్తి గతంలో పీపుల్స్ వార్ గ్రూప్‌లో దళ కమాండర్‌గా పనిచేసేవాడు.1999లో వీర్నపల్లి బస్టాండ్ వద్ద నర్సయ్య సహా దళ సభ్యులు వీర్నపల్లి కి చెందిన అంజయ్యను పోలీస్ ఇన్ఫార్మర్ గా భావించి కాల్చివేసిన ఘటనపై అప్పట్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.ఈఘటనపై అజంయ్య కుమారుడు జక్కుల సంతోష్ తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష్య పెంచుకున్నాడు.ఇటీవలి కాలంలో బల్లెపు నర్సయ్య ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన సంతోష్ మరింత కక్ష్య పెంచుకొని బల్లెపు నర్సయ్య తో ఒక రిపోర్టర్ గా పరిచయం పెంచుకొని గత మూడు నెలలుగా ఇంటర్వ్యూ చేస్తానని నమ్మించి ఇంటర్వ్యూ కోసం ఆగ్రహరం గ్రామానికి రావాలని బల్లెపు నర్సయ్య కు చెప్పగా నరసయ్య నవంబర్ 27 రోజున మధ్యాహ్ననానికి ఇద్దరు అగ్రహారం గ్రామానికి చేరుకోగా సంతోష్ ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం, ఆప్రాంతంలో ఒంటరిగా ఉన్న సమయంలో రాళ్లతో దాడి చేసి మృతుడిని అక్కడికక్కడే హత్య చేశాడు.
ఈ ఘటనపై వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆధునిక సాంకేతికతతో విచారణ చేపట్టి ఈరోజు నిందితుడు జక్కుల సంతోష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రచరి తెలిపారు.
ఈకేసును విజయవంతంగా ఛేదించిన సిఐ వీర ప్రసాద్, ఎస్సై రామ్మోహన్, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నాగేంద్రచారి అభినందించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >