| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల : తల్లి మృతిని తట్టుకోలేక తనయుడు ఆత్మహత్య

News

Posted on 2025-11-28 15:09:27

Share: Share


రాజన్న సిరిసిల్ల : తల్లి మృతిని తట్టుకోలేక తనయుడు ఆత్మహత్య

డైలీ భారత్ న్యూస్ సిరిసిల్ల: తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లలిత అనే మహిళకు అభిలాష్ అనే కొడుకు ఉన్నాడు. ఇతను సిరిసిల్ల సర్దాపూర్ 17 బెటాలియన్ లో టీజీఎస్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు్న్నాడు. ఏమైందో ఏమో తెలీదు గానీ.. గురువారం లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గురువారం మొత్తం గాలించారు. అలాగే గ్రామస్తులు కూడా పరిసరాలు మొత్తం వెతికారు. ఈ క్రమంలో చివరకు శుక్రవారం లలిత మృతదేహాన్ని బయటికి తీశారు.

తల్లి మృతదేహాన్ని చూసి.. కొడుకు అభిలాష్ తట్టుకోలేకపోయాడు. తల్లి దూకిన వాగులోనే తానూ దూకాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న వారికి ఈత రాకపోవడంతో అతన్ని కాపాడలేకపోయారు. చివరకు కొడుకు కూడా అదే వాగులో ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి బాగోగులు చూసుకునే కొడుకులు కనుమరుగవుతున్న నేటి రోజుల్లో.. తల్లి లేదన్న విషయం తెలిసి, తానూ ఆత్మహత్య చేసుకున్న కొడుకును చూసి అంతా అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లి, కొడుకు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >