| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వడ్డీ వ్యాపారులపై కొరడా ఝాలిపించనున్న జిల్లా అధికారిక యంత్రాంగం

వడ్డీ వ్యాపారులపై కొరడా ఝాలిపించనున్న జిల్లా అధికారిక యంత్రాంగం

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇకపై జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలపై వడ్డీలకు, చక్ర వడ్డీలు పేరిట వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకాలను సహించేది లేదని వారిపై అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపెందుకు చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించింది. నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్టు కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించడం జరిగిందని అన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (లైసెన్స్) కలిగి ఉండాలన్నారు. నియమ, నిబంధనలు తు.చ తప్పక పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Previous ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం బలమైన పునాది లాంటిది : టీ పీ సీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Next భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
ADVERTISEMENT