| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:ఓ వైపు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని ఫిల్మ్‌నగర్ పరిధిలో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్‌ గా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్ పరిధిలో నివాసం ఉంటున్న శశికాంత్ అనే వ్యక్తి తనకు తానుగా ఐఏఎస్ అని చెప్పుకుంటూ హల్‌చల్ చేస్తున్నాడు. ఏకంగా ఇద్దరు గన్‌మెన్లు, ఫేక్ ఐడీ కార్డులను పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. నగర శివార్లలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందు. అసలు అతడు ఐఏఎస్ ఆఫీసరే కాదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Previous కార్మికులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Next "నీ ఓమ్" ఇంటీరియర్, ఆర్కటేక్చర్ డిజైన్ స్టూడియో ప్రారంభం
ADVERTISEMENT