Posted on 2025-11-26 08:46:10
డైలీ భారత్ న్యూస్, సిరిసిల్ల:ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో సిరిసిల్ల, గణేష్ నగర్ లోని పవర్ లూమ్ కార్మికులకు మనో వికాస సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ నిర్వహించినారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాటడుతూ కార్మికులు మానసిక ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రస్తుతం వేగంగా మారుతున్న ప్రపంచంలో, పని బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి పెరుగుతోందని అన్నారు.
ఆరోగ్యం దెబ్బతింటే ఉత్పాదకత తగ్గిపోవడంతో పాటు కుటుంబ, ఆర్థిక సమస్యలు మరింత తీవ్రం అవుతాయని అన్నారు.
ఈ నేపథ్యంలో కార్మికులు ఆరోగ్య సంరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవడం అత్యవసరం అని కార్మికులకు సూచించినారు.
కార్మికుల్లో ఎక్కువగా మద్యపాన వ్యసనం, తంబాకు నమలడం, బీడీ, సిగరెట్ త్రాగడం లాంటి దురలవాట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
దురలవాట్ల ద్వారానే అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తున్నట్లు పేర్కొన్నారు.
మెదడు, నరాల సమస్యలు, నిద్రలేమి, భయాలు, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్ లాంటి అనేక జీవన శైలి వ్యాధులు దురలవాట్ల ద్వారానే వస్తున్నట్లు కార్మికులకు వివరించారు.
కార్మికులు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేసుకోవడం, మంచి ఆరోగ్యపు అలవాట్లను కల్గి వుండడం, పోషకాహారం, తగినంత విశ్రాంతి మరియు మానసిక ఆరోగ్య సేవలు పొందటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
అలసట, ఒత్తిడి, మానసిక వ్యాధులు వంటి సమస్యలను ముందే గుర్తించి నివారించేందుకు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు.
కాబట్టి “ఆరోగ్యం మొదటి ప్రాధాన్యత” కావాలనే సందేశాన్ని ప్రతి కార్మికుడు అందుకోవాలని కోరారు.
మానసిక సమస్యల నుండి బయటపడేందుకు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపేల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >