| Daily భారత్
Logo




ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి

News

Posted on 2025-11-21 14:58:07

Share: Share


ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి

జిల్లా బీ ఆర్ ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్న గారి మధుసూదన్ రావు వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పార్ములా -ఈ కార్ లో అవినీతి లేనిది ఉన్నట్లు సృష్టించిన కుట్రలో కాంగ్రెస్ భాజపా భాగస్వాములని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. కేసీఆర్ సకల జనులను కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రం సాధించినందుకా, పదేళ్ల తెలంగాణ ప్రగతిని ప్రజల ముంగిట ఉంచినందుకా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించినందుకా కాంగ్రెస్ భాజపా కలిసికట్టుగా కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్ములా -ఈ కార్ అనే దానితో ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు కేటీఆర్ మలిపిండని ఆయన తెలిపారు. అసలు అందులో అవినీతే లేదని, లేనిదానిని ఉన్నట్లు చూపడంలో కాంగ్రెస్ భాజపా ల కణికట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పార్ములా ఈ తో రాష్ట్ర ఖజానాకు లాభమే చేకూరిందని, హైదరాబాద్ కీర్తిప్రతిష్టలు పెరిగాయని ఆయన వివరించారు. హైదరాబాద్ ను ఐటి రంగంలో శిఖరాగ్రానికి చేర్చిందే కేటీఆర్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రoలో భారాస ను ఎదగానీయరాదనే కుట్రకోణమే ఉన్నదని ఆరోపించారు. కేటీఆర్ ను రాజకీయంగా బద్నామ్ చేసే రాజకీయ కక్ష సాధింపులో భాగమే కాంగ్రెస్ భాజపా ల అక్రమ కలయికతో రాష్ట్ర గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చినట్లు మధుసుధన్ రావు అన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >